ATP: బుక్కపట్నంలోని డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను డిప్యుటేషన్ (ఫారిన్ సర్వీసు)పై భర్తీ చేయనున్నట్లు జిల్లా డీఈఓ ప్రసాద్‌బాబు తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 29వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. 30, 31 తేదీల్లో స్క్రూటినీ, నవంబర్ 5 నుంచి 8 వరకు ఆన్లైన్ పరీక్ష ఉంటుందని ప్రకటించారు.