MNCL: 42% రిజర్వేషన్ కల్పించి బీసీలకు ప్రభుత్వం న్యాయం చేయాలని బీసీ కులాల ఐక్య ఉద్యమ పోరాట సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య వెల్లడించారు. శుక్రవారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు మేలు చేసేందుకు ప్రభుత్వం జీవో నెంబర్ 9ని జారీ చేసిన కోర్టులు కొట్టివేశాయన్నారు. దేశ జనాభాలో బీసీలు 50% కు పైగా ఉన్నారని, బీసీలకు న్యాయం చేయాలన్నారు.