TG: మంత్రులు చేసే తప్పులకు IASలు బలికావొద్దని మాజీ మంత్రి KTR విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఒత్తిడితోనే ఇవాళ IAS రిజ్వీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. CM రేవంత్ లేదా మరో మంత్రి చేసే అరాచకాలకు మద్దతు పలికితే IASలకు కూడా శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ అక్రమాల్లో తాము ఎందుకని అధికారులు పారిపోతున్నారు అంటూ విమర్శించారు.