TG: నకిలీ మద్యం కేసు సూత్రధారులు టీడీపీ నేతలేనని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ‘తంబళ్లపల్లె టీడీపీ ఇంఛార్జ్ జయచంద్రారెడ్డి, జనార్ధన్ రావు, కట్టా సురేంద్ర నాయుడు కల్తీ లిక్కర్ నిందితులు. నకిలీ మద్యం కేసు డైవర్ట్ చేయడానికి వైసీపీపై నెపం వేస్తున్నారు. వైసీపీపై బురద జల్లడానికి తప్పుడు సాక్షాలు సృష్టిస్తున్నారు. సిట్ పేరుతో విచారణ అంటూ వైసీపీని టార్గెట్ చేస్తున్నారు’ అని తెలిపారు.