ADB: విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నిఖిల్ డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. గుడిహత్నూర్ మండలం సీతాగొంది, కమలాపూర్ గ్రామం పిల్లలు 30 మంది గుడిహత్నూర్ మోడల్ స్కూల్లో చదువుకుంటున్నారని పేర్కొన్నారు. కానీ బస్సులు సమయానికి రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.