VKB: వికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ. 437 కోట్లు ఖర్చు చేయనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొడంగల్ ప్రజల చిరకాల కల ఈ ప్రాజెక్టుతో నెరవేరనుంది. రైల్వే మార్గం ఏర్పాటుకు తొలి అడుగు విజయవంతంగా పడగా, దీనికోసం 845 హెక్టార్ల భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది.