HYD: లక్డీకాపూల్లోని డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ కార్యాలయ ముట్టడికి బీజేపీ నేతలు యత్నించారు. ఈ సందర్భంగా డీజీపీ కార్యాలయం వద్దకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు చేరుకోగా.. రామచందర్ రావుతో పాటు బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో లక్డీకాపూల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.