MDK: చేగుంట మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు. పేర్ల దుర్గ స్వామికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, గురువారం భూమి పూజ నిర్వహించారు. త్వరితగతిన ఇంటి నిర్మాణ పనులను పూర్తిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వడ్ల నవీన్ కుమార్, స్టాలిన్ నర్సింలు, కురుమ లక్ష్మీ పాల్గొన్నారు.