AP: కల్తీ మద్యం తయారీకి ఆద్యులు జగనేనని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ‘ఆఫ్రికాలో కల్తీ మద్యం వ్యాపారం నిజం కాదా అని ప్రశ్నించారు. వైఎస్ సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి.. జగన్ బినామీలు కాదా? ప్రతాప్, కాకాణిని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదో జగనే చెప్పాలి. జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడిని టీడీపీ నుంచి సస్పెండ్ చేశాం’ అని చెప్పారు.