HYD: నగరంలోని రెడ్ హిల్స్, ఖైరతాబాద్, లక్డికాపూల్, కూకట్పల్లి ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల స్వల్పం నుంచి మోస్తరు వర్షం పడుతోంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మరికాసేపట్లో మిగతా ప్రాంతాలకు సైతం వర్షం విస్తరించే అవకాశం ఉందన్నారు.