KDP: ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన ఈ క్రాప్ చేయించుకున్న రైతులు అధైర్య పడవద్దని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 7 మండలాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వాటి ద్వారా రైతుల ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు.