SRCL: ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన సన్నరకం ధాన్యానికి క్వింటాకు అదనంగా రూ.500 బోనస్ అందిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రకటించారు. గురువారం వేములవాడ మండలం వట్టెంల గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఖరీఫ్ సీజన్లో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు.