W.G: వీరవాసరం వ్యవసాయ పరపతి సొసైటీ సంఘం ఛైర్మన్ వీరవల్లి శ్రీనివాసరావు, డైరెక్టర్లుగా బండారు మణికంఠ బ్రహ్మానందం, దూసనపూడి శ్రీనివాస్‌లు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల కాలంలో పీఏసిఎస్లు రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని అన్నారు.