TPT: రామచంద్రాపురం మండల పరిధిలోని రాయల చెరువును గురువారం ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పరిసర గ్రామాలు ముంపునకు గురికాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను గుర్తించి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.