AKP: మాడుగుల మండలం కింతలి వల్లాపురంలో మాజీ ఉపముఖ్యమంత్రి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో గురువారం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేశారు. ఈ సందర్భంగా ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే పేద ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.