తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఎన్నో హిట్ సినిమాలకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ సబేష్ కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తమిళంలో ఆయన 25 సినిమాలకుపైగా మ్యూజిక్ అందించారు.