శబరిమల ఆలయ బంగారం కేసులో సిట్ కీలక చర్యలు చేపట్టింది. ఈ కేసులో మాజీ అడ్మినిస్ట్రేటివ్ అధికారి మురారీ బాబును సిట్ బుధవారం రాత్రి అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం సిట్ అధికారులు అతడిని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆలయ బోర్డు ఇప్పటికే మురారీ బాబును విధుల నుంచి తప్పించింది. ఆలయ బంగారానికి సంబంధించిన ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోంది.