డీఎంకే పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులు వారంలో కనీసం 4 రోజులు వారి వారి నియోజకవర్గాల్లో బస చేయాలని తమిళనాడు CM స్టాలిన్ ఆదేశించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ‘కలైంజర్ మహిళా సాధికారత’ పథకం అమలు తీరును పర్యవేక్షించాలన్నారు. ఈ పథకంలో గృహిణులకు ప్రతి నెలా రూ.1,000 జమచేస్తున్నారు.