ADB: పట్టణంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా ఆబ్కారీ, జిల్లా షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, గిరిజన అభివృద్ధి శాఖల అధికారులతో కలెక్టర్ రాజర్షి షా గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని 40 ఏ4 మద్యం దుకాణాలలో డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించారు. గౌడ కులస్తులకు ఒకటి, ఎస్సీలకు 5, ఎస్టీలకు 9 దుకాణాలు వచ్చినట్లు తెలియజేశారు.