HYD: తెలంగాణ రాష్ట్రం భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఈరోజు సాయంత్రం రవీంద్ర భారతిలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కల్పన గౌడ్ తెలిపారు. ఈ వేడుకలకు నర్సింగ్ ఆఫీసర్లు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని, బతుకమ్మ వేడుకలపై వ్యాసరచన పోటీలు కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.