అన్నమయ్య: మదనపల్లెలోని కోర్టులో గంగమ్మ ఆలయం నందు శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ గంధం అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. వేకువజామునే అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పారు. పంచామృతాభిషేకం, మహా మంగళహారతి ఇచ్చి ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు.