SGR: మంబాపూర్ ఎస్వీఎస్ పరిశ్రమ ప్రమాదంలో కార్మికుడు మృతి చెందిన సంఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అభిషేక్ (22) ఈ నెల 24న పనిచేస్తున్న సమయంలో మెషీన్లో ఇరుక్కొని దుర్మరణం చెందాడు. మృతుడి అన్న అనికేత్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.