ప్రకాశం: జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శుక్రవారం డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ మేరకు అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.