BDK: మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం సమావేశం నిర్వహించారు. రానున్న స్థానికల ఎన్నికలలో శక్తి వంచన లేకుండా పనిచేయాలని అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసిన విధంగా ఈ సమయంలో కూడా మన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే దిశ నిర్దేశం చేశారు.