SKLM: రణస్థలం మండలం సంచాం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో దుప్పాడ సంతోష్ (35) తన కుమార్తె హైమా(11)తో పాటు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం భార్య స్వాతి పెద్దపాడు వెళ్లి ఆలస్యంగా రావడంతో వాగ్వాదం జరిగింది. మనస్తాపంతో బుధవారం మధ్యాహ్నం కుమార్తెకు, తనకు పురుగుమందు తాగించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఇద్దరూ మృతి చెందారు.