ELR: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద గురువారం సాయంత్రానికి నీటిమట్టం 30.80 మీటర్లకు చేరింది. 6.50 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తాంది. భద్రాచలం వద్ద ఉదయం 34.90 అడుగులున్న నీటిమట్టం సాయంత్రానికి 37.10 అడుగులకు చేరింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది.