ప్రకాశం: పామూరు పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. స్థానిక మమ్మీ డాడీ సెంటర్లో ఎస్సై సురేష్ సిబ్బందితో కలిసి పలు కార్లను, ద్విచక్ర వాహనాలను ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. వాహనాల్లో మాదక ద్రవ్యాలను, హానికర వస్తువులను రవాణాచేయకూడదని హెచ్చరించారు. అలా చేస్తే చర్యలు తప్పవని తెలిపారు.