SGR: సింగూర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. 81,655 క్యూసెక్కులు వరద చేరిందని AEE జాన్ స్టాలిన్ శుక్రవారం ఉదయం తెలిపారు. ప్రాజెక్టు 9 గేట్ల ద్వారా దిగువకు జలాలు వదిలినట్లు చెప్పారు. డ్యాం నీటిమట్టం 17.560 TMCలకు చేరింది. అయితే డ్యాం సేఫ్టీ మేరకు నిర్ధారించిన 16TMCలకు దాటి వచ్చిన వరద నీటిని వదిలినట్లు చెప్పారు.