BHNG: అడ్డగూడూరు మండలం వెల్దేవిలో గ్రామ పంచాయతీ సిబ్బంది లేక ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని రోడ్లపై చెత్తా చెదారం లేకుండా చూసుకోవాల్సిన సిబ్బంది కరువయ్యారని గ్రామస్తులు వాపోతున్నారు. సిబ్బంది వీధుల్లోకి రాకుంటే సెక్రెటరీ సిబ్బందిని మార్చి వెంటనే పనులను సాఫీగా సాగేటట్టు చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల కోరుతున్నారు.