ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన బ్రకోలీ ఇటలీకి చెందిన క్యాబేజీ వంటి ఆకుకూర. దీనిని అక్కడ 2000 సంవత్సరాల నుంచి పండిస్తున్నారు. బ్రకోలీలో ఉండే సహజసిద్ధమైన సల్ఫోరాఫేన్ సమ్మేళనం క్యాన్సర్ కణితులపై పోరాడుతోంది. అంతేకాకుండా బ్రకోలీలో అధికస్థాయిలో ఉండే సీ, కే విటమిన్లు రోగనిరోధకశక్తిని అందించడంతో పాటు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఒత్తిడిని దూరం చేస్తాయి.