బెంగళూరులో దారుణ ఘటన జరిగింది. ఓ ఇంట్లోకి చొరబడి ఐదుగురు దుండగులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, నగదు, మొబైల్ ఫోన్లు దోచుకెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దుండగులు వారిని బెదిరించి, ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.