MHBD: 42% రిజర్వేషన్ కోసం రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న BC జనసభ జిల్లా అధ్యక్షుడు చల్లా గోవర్ధన్, నేతలు కిర్తీ ఉదయ్, ఉప్పలయ్య, గండు సురేష్లను ఇవాళ బయ్యారం పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. గోవర్ధన్ మాట్లాడుతూ.. BCలకు విద్య, ఉపాధి రంగాల్లో నష్టం జరుగుతోందని, 42% రిజర్వేషన్ సాధించే వరకు ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు.