పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో దర్శకుడు హను రాఘవపూడి పీరియాడికల్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇవాళ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా తాజాగా ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్ను షేర్ చేశారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఇమాన్వి కథానాయికగా నటిస్తున్నారు.