MDK: తూప్రాన్ పట్టణ పరిధి టోల్ ప్లాజా వద్ద బుధవారం రాత్రి పట్టుబడిన గంజాయి రవాణాలో వాహనాన్ని అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది. గంజాయి వ్యాపారం చేసే వ్యక్తులు సెల్ఫ్ డ్రైవింగ్ వాహనము అద్దెకి తీసుకొని పది రోజులుగా పర్యటిస్తున్నారు. రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.