BHNG: బీబీనగర్ ఎయిమ్స్ ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్‌పై రైలు కిందపడి ఓ యువకుడు ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పోచంపల్లి మండలం అంతమ్మగూడెంకు చెందిన అభిలాష్(19)గా గుర్తించారు. మృతదేహాన్ని భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.