ఆసియాన్ సదస్సుకు ప్రధాని మోదీ వర్చువల్గా పాల్గొనడంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. US అధ్యక్షుడు ట్రంప్ నుంచి తప్పించుకోవడానికే మోదీ సదస్సుకు దూరంగా ఉన్నారని పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ Xలో పోస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ను ఆపినట్లు 53 సార్లు, రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపినట్లు 5 సార్లు ట్రంప్ ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.