JGL: ఇబ్రహీంపట్నం మండలంలోని గ్రామాల్లోని ప్రధాన రహదారులకు ఇరువైపుల పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని పంచాయతీ కార్యదర్శులను ఎంపీడీవో సలీం ఆదేశించారు. ఇబ్రహీంపట్నం మండలం గోదూరు గ్రామ శివారులో రహదారికి ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తున్న పనులను పరిశీలించారు. పిచ్చి మొక్కలు పెరగడంతో రోడ్డు ఇరుకుగా మారి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.