ATP: అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని CRIT కళాశాల సమీపంలో పెట్రోల్ బంకు వద్ద నిలిపి ఉన్న లారీలో డ్రైవర్ మృతదేహం లభ్యమైంది. నైట్ బీట్ పోలీసులు తనిఖీ చేస్తుండగా ఈ ఘటన బయటపడింది. మృతుడు తమిళనాడు శంకగిరి తాలూకాకు చెందినవాడిగా గుర్తించారు. గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.