హైదరాబాద్ శివారులోని సాగర్ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం తమ్మలోనిగూడ గేటు వద్ద ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రికి గాయాలు అయ్యాయి. ఇద్దరు పిల్లలు అభిరామ్ (9), రామ(5) అక్కడికక్కడే మృతి చెందారు. రక్తపు మడుగులో ఉన్న పిల్లలను చూసి తల్లి కన్నీరుమున్నీరైంది. ఈ దృశ్యం చూసిన స్థానికులు చలించిపోయారు.