ELR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో షెడ్యూల్ కులాల సంఘం కమిటీ మెంబర్గా చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు వెలుపడ్డాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియామకం పట్ల నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.