W.G: జీలుగుమిల్లి మండల కేంద్రంలో రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు పాల్గొన్నారు. ఈసందర్భంగా తెల్లం బాలరాజు మాట్లాడుతూ.. రాష్ట్రానికి కేటాయించిన మెడికల్ సీట్లు వద్దని చంద్రబాబు లేఖ రాయడం దుర్మార్గమని మండిపడ్డారు. మెడికల్ సీట్ల కోసం పక్క రాష్ట్రాలు కేంద్రం వద్ద ప్రదక్షిణలు చేస్తున్నాయని అన్నారు.