SRPT: రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి అన్నారు. గురువారం మోతే మండలం అన్నారి గూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.