KDP: రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా సాగుతుందని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ ద్వారక తిరుమలరావు తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక ఆర్టీసీ డిపోను, బస్టాండ్‌ను ఆయన పరిశీలించారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందన్నారు. 60 శాతం స్త్రీలు, 40 శాతం పురుషులు రోజువారిగా బస్సులలో ప్రయాణిస్తున్నారన్నారు.