ప్రకాశం: గిద్దలూరు నుంచి నంద్యాల ఘాట్ రోడ్డులో ఇవాల ఓ పెద్ద కంటైనర్ లారీ రోడ్డుపై మరమ్మతులు కారణంగా అడ్డంగా నిలిచిపోయింది. గిద్దలూరు, నంద్యాల మధ్యలో వాహనం నిలిచిపోవటంతో ట్రాఫిక్ జామ్ అయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.