W.G: ఆకివీడు ఎంపీడీవోగా డి. బాబురావు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం ఈవోపీఆర్డీగా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై ఇక్కడకు ఎంపీడీవోగా వచ్చారు. ఈయనకు పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. బాబురావు మాట్లాడుతూ.. ప్రజలకు ఏప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తానని తెలిపారు.