TG: రేపు రిలీజ్ కానున్న పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా బెనిఫిట్ షోలు, టికెట్ రెట్లను పెంపును హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్న వారికి డబ్బులు వస్తాయా? లేదా? అన్న చర్చ మొదలైంది. అయితే బెనిఫిట్ షో, మిగతా టికెట్లకు పెంచిన ధరలను రిఫండ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. మరీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.