సాధారణంగా వయసు మీద పడుతున్న కొద్దీ కంటి సమస్యలు వెంటాడుతాయి. కొందరికి దగ్గరి దృష్టి, మరికొందరికి దూరదృష్టి సమస్యలు వస్తాయి. వీటిని ప్రస్తుతం ఆపరేషన్ ద్వారా కొంతవరకు నయం చేస్తున్నారు. అయితే దగ్గరి దృష్టిని తగ్గించేందుకు కొత్తగా కంటి చుక్కల మందు అందుబాటులోకి వచ్చింది. ఇది కేవలం గంట వ్యవధిలోనే పనిచేస్తుంది. కాగా, కంటి వైద్యుడి సూచన మేరకే.. ఈ మందు వాడాలి.