BHPL: జిల్లా ఎక్సైజ్ శాఖ పరిధిలోని 59 మద్యం దుకాణాలకు బుధవారం వరకు 1,672 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ SP శ్రీనివాస్ తెలిపారు. ఇవాళ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. గతేడాది 59 షాపులకు రూ.43.22 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ఈసారి తక్కువ దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రేపు చివరి రోజు కావడంతో సంఖ్య పెరుగుతుందని ఆయన అన్నారు.