ADB: గాదిగూడ మండలంలోని పలు గ్రామాల్లో అదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు నగేష్ బుధవారం సాయంత్రం పర్యటించారు. గ్రామానికి వచ్చి ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.