NRPT: ధన్వాడ మండలంలోని కొండాపూర్ గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు బుధవారం శ్రమదానం చేసి పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. ఇందులో భాగంగా పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించారు. పాఠశాల పరిసరాలను శుభ్రం చేయాలని కోరుతున్న గ్రామపంచాయతీ అధికారులు, ఉపాధి హామీ అధికారులు, పట్టించుకోవడంలేదని, అందుకే తామే స్వచ్ఛందగా బాగు చేసుకున్నామని విద్యార్థులు పేర్కొన్నారు.